Land Rights and Land Protection Scheme : నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేకోసం రోవర్ తరహా... పరికరాలు తప్పకుండా ఉండాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తొలిదశలో 2వేల గ్రామాల్లో... వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, గనులశాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. రెవెన్యూ శాఖ పరిధిలో తొలి దశలో చేపట్టిన 2వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియపై వివరాలపై సీఎం ఆరా తీశారు. ఇప్పటికే చాలావరకు పత్రాల పంపిణీ జరుగుతోందని అధికారులు తెలిపారు. అవసరమైనంతమేర రోవర్లను ఆర్డర్ చేయాలన్నారు. దీనివల్ల అనుకున్న సమయానికే సర్వే ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేకోసం పరికరాలు ఉండాలన్నారు. రోవర్ తరహా... పరికరాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. దీనివల్ల సర్వేయర్ పూర్తిస్థాయిలో తన పనిని పూర్తిచేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
టాంపర్ చేయలేని విధంగా పత్రాలు... జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం అత్యంత ప్రాధాన్యత అని సీఎం స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతపెద్ద స్థాయిలో సర్వే చేపట్టడం లేదని తెలిపారు. ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమమని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా పత్రాలు అందిస్తున్నామని, ఇది ఇప్పటివారికే కాకుండా భవిష్యత్తు తరాలవారికీ చాలా ఉపయోగమన్నారు. పనులు ఆలస్యం కాకుండా సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేకోసం రోవర్ తరహా... పరికరాలు తప్పకుండా ఉండాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సర్వే రాళ్లు సిద్ధం.. సర్వే పూర్తైన అనంతరం సరిహద్దులు గుర్తించేలా 31 లక్షల సర్వే రాళ్లను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. ఈ మేరకు రోజూ 50వేల రాళ్ల చొప్పున సరఫరా చేసేందుకు ప్రణాళిక వేసుకున్నామన్నారు. తర్వాత దశల్లో రాళ్ల కొరత రాకుండా ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ ప్రాంతాల్లో చేయాల్సిన సర్వేకోసం సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి డేటా క్రోడీకరణ జరుగుతుందన్నారు.
మే 20 లోగా పూర్తి కావాలి... నిర్దేశించుకున్న టైం లైన్స్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో సర్వే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. డిసెంబర్ నెలాఖరు లోగా అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి :