తెలంగాణలోని నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెంలోని స్మృతి స్థలంలో... నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు నిర్వహించారు. నోముల అంతిమ సంస్కారాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. నర్సింహయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెరాస శ్రేణులు పాల్గొన్నారు. అనారోగ్యంతో ఈనెల 1న నోముల నర్సింహయ్య హైదరాబాద్లో కన్నుమూశారు.
ఇదీ చూడండి: