ETV Bharat / state

రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటి.. ఆదాయం ఎలా ఉంది.. సీఎం జగన్ ఆరా - ఆంధ్రప్రదేశ్ ఆదాయం

CM Review : రాష్ట్ర ఆదాయంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఎక్సైజ్, రెవెన్యూ శాఖల మంత్రులు, పలు శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆదాయార్జనపై ఆరా తీశారు. ఈ విషయంలో ఏపీ కంటే ముందున్న రాష్ట్రాల్లో అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించారు.

ముఖ్యమంత్రి జగన్
ముఖ్యమంత్రి జగన్
author img

By

Published : Feb 9, 2023, 7:24 PM IST

CM Review : ఆదాయార్జనలో మెరుగైన విధానాలు, చక్కని పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. అధ్యయనంలో తేలిన విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని ఆదేశించారు. నిర్ణయించిన లక్ష్యాల మేరకు ఆదాయాన్ని తీసుకురావాలని అధికారులను నిర్దేశించారు. వివిధ శాఖలు వసూలు చేసిన పన్నుల మొత్తాన్ని సమీక్షించిన సీఎం.. పలు కీలక ఆదేశాలిచ్చారు. ఆదాయార్జనలో నిర్ణయించిన లక్ష్యానికి చేరువగా ఉన్నట్లు సీఎంకు తెలిపిన అధికారులు... పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామన్నారు. పన్ను చెల్లింపు దారులకు సౌలభ్యమైన విధానాల ద్వారా ఆదాయాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు.

ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ఎక్సైజ్, రెవెన్యూ శాఖల మంత్రులు కె.నారాయణ స్వామి, ధర్మాన ప్రసాదరావు, సీఎస్‌ డాక్టర్‌ కెఎస్‌. జవహర్‌రెడ్డి సహా అటవీ, పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎక్సైజ్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, గనులు భూగర్భశాఖ, హోంశాఖ, రవాణాశాఖ, వాణిజ్య పన్నుల శాఖ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పలు శాఖల నుంచి వస్తోన్న ఆదాయంపై సీఎం చర్చించారు. లక్ష్యాలను ఏ మేరకు చేరువయ్యారనే విషయం పైనా చర్చించారు.

జీఎస్టీ వసూళ్లలో ముందంజ.. కోవిడ్‌ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. లక్ష్యాలకు దగ్గరగా ఆదాయాలు ఉన్నాయని వివరించారు. డిసెంబర్‌ 2022 వరకూ జీఎస్టీ గ్రాస్‌ వసూళ్లలో దేశ సగటు 24.8 శాతంగా ఉండగా... రాష్ట్రంలో వసూళ్లు 26.2 శాతం ఉందన్నారు. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌, రాష్ట్రాల కన్నా మెరుగైన వసూళ్లు రాష్ట్రంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. 2022 జనవరి నాటికి జీఎస్టీ వసూళ్లు రూ.26,360.28కోట్లు ఉంటే, ఈ ఏడాది జనవరి నాటికి రూ.28,181.86 కోట్లు వచ్చాయని తెలిపారు. గతేడాది ఇదే కాలపరిమితితో పోల్చుకుంటే 6.91 శాతం పెరుగుదల కనిపించిందని అధికారులు వివరించారు. జీఎస్టీ, పెట్రోలు, ప్రొఫెషనల్‌ ట్యాక్స్, ఎక్సైజ్‌ ఆదాయాలను కలిపితే జనవరి 2023 నాటికి ఆదాయాల లక్ష్యం రూ.46,231 కోట్లు కాగా, రూ.43,206.03 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు. దాదాపు 94 శాతం లక్ష్యాన్ని సాధించామని సీఎంకు తెలిపారు.

ఎర్ర చందనం విక్రయాలకు సన్నాహాలు.. గనులు – ఖనిజ శాఖలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 6 వరకూ రూ.3,649 కోట్ల ఆర్జించినట్లు తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నూటికి నూరుశాతం చేరుకున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆపరేషన్‌లో లేని గనులను ఆపరేషన్‌ లోకి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. రవాణా శాఖలో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి లక్ష్యంగా రూ.3,852.93 కోట్లు కాగా, 3,657.89 కోట్లకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్‌ లాంటి పరిస్థితులు పూర్తిగా పోయి పరిస్థితులు నెమ్మదిగా గాడిలో పడుతున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నామని, మూడు దశల్లో విక్రయానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

సరళీకరణ విధానాలు... ఏపీ కన్నా మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో విధానాలను అధికారులు అధ్యయనం చేయాలని, తద్వారా మంచి విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం ఆదేశించారు. పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపు దారులకు సౌలభ్యమైన విధానాల ద్వారా ఆదాయాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. విధానాలను సరళీకరించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని వివరించారు. డేటా అనలిటిక్స్‌ వల్ల వసూళ్లు మెరుగుపడుతున్నాయని చెప్పారు. సిబ్బందికి శిక్షణ, వారి సమర్థతను మెరుగుపరుచుకుంటున్నామని వెల్లడించారు. టాక్స్‌ అసెస్మెంట్‌ను ఆటోమేటిక్‌ పద్ధతుల్లో అందించే వ్యవస్థను నిర్మించుకున్నామని, దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు మరింత సులభంగా సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. డివిజన్‌స్థాయిలో కేంద్రీకృత రిజిస్ట్రేషన్‌ యూనిట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పన్ను చెల్లింపుదారులకు పారదర్శకత పద్ధతులను అందుబాటులో ఉంచామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.