ETV Bharat / state

'చెన్నై, కోల్‌కతా కేంద్రంగా మానవ అక్రమ రవాణా'

టెర్రరిజం, కరోనా నియంత్రణ, తీరప్రాంత గస్తీ, మనుషుల అక్రమ రవాణాపై దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్... మనుషుల అక్రమ రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.రాష్ట్రంలోని 4 జిల్లాల్లో మనుషుల అక్రమ రవాణా జరుగుతోందని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. చెన్నై, కోల్​కతా కేంద్రంగా ఈ దందా సాగుతోందని వివరించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున్న మద్యం ఏపీకి అక్రమంగా రవాణా అవుతుందని.. ఇటువంటి చర్యలను పూర్తిస్థాయిలో నివారిస్తామని పేర్కొన్నారు.

dgp gowtham sawang
dgp gowtham sawang
author img

By

Published : Jul 11, 2020, 10:11 PM IST

Updated : Jul 11, 2020, 11:44 PM IST

టెర్రరిజం, కరోనా నియంత్రణ, మనుషుల అక్రమ రవాణా అంశాలపై దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు కీలక సమావేశం నిర్వహించారు . వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, కేరళ డీజీపీ లోక్ నాథ్ బెహరా, తమిళనాడు డీజీపీ జె.కె త్రిపాఠి, కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సుద్​తో పాటు ఇంటెలిజెన్స్, సీఐడీ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. తీరప్రాంత గస్తీ, మాదక ద్రవ్యాల రవాణా, మావోయిజం, ఉగ్రవాద కార్యకలాపాలు, మనుషుల అక్రమ రవాణా, ఇసుక, మద్యం అక్రమ రవాణా నియంత్రణ, నాన్ బెయిలబుల్ వారంట్ల ఎగ్జిక్యూషన్లలో సహకారం, ఐ.సి.జె.ఎస్​తో పాటు కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్రాల మధ్య సమన్వయంపై చర్చ జరిగింది.

తీర గస్తీపై చర్చ

తమిళనాడు రాష్ట్రం నుంచి తప్పించుకున్న టెర్రరిస్టులను పట్టుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దులలో విస్తరిస్తున్న మావోయిస్టు కార్యకలాపాలను కట్టడిచేయాలని అభిప్రాయపడ్డారు. దేశ భద్రతలో అత్యంత కీలకమైన తీరప్రాంత గస్తీ, కోస్టల్ సెక్యూరిటీ, కోస్టల్ గార్డ్ బోట్ల నిర్వహణపై చర్చించారు. తీర ప్రాంత గస్తీ కష్టంగా ఉన్నందున వాటి నిర్వహణకు కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వ నుంచి కోరాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

అక్రమ రవాణా

ఉపాధి కల్పన పేరుతో యువతులు, మహిళలను మాయ మాటలతో అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల నుంచి చెన్నై, కోల్​కతా నగరాలకు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని..ఈ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కోరారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులతో కేవలం ఏడు వారాల వ్యవధిలోనే 20 వేల కేజీలకు పైగా గంజాయిను స్వాధీనం చేసుకున్నామని డీజీపీ తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మద్యం అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని.. దానిని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని డీజీ‌పీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి

ఆమె చెడు సావాసం... కుటుంబానికి రాసింది మరణశాసనం!

Last Updated : Jul 11, 2020, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.