కృష్ణా జిల్లా మోపిదేవి మండలం నాగాయతిప్ప సరిహద్దులో కృష్ణా నది తీరంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న నిరుపేదలకు సాయం అందింది. 'కృష్ణా నది ఒడ్డే అవాసం..ఒక్క పూటే భోజనం' శీర్షికన 'ఈటీవీ భారత్' వెలువరించిన కథనానికి అధికారులు, దాతలు స్పందించారు. పురిటిగడ్డకు చెందిన 'ఇండి విలేజ్ మినిస్ట్రీస్' సంస్థ అధినేత వేములపల్లి సురేష్... బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రతి నెలా వారికి కావాల్సిన సరకులు అందిస్తామన్నారు. ప్రభుత్వం స్థలం చూపిస్తే.. తమ సంస్థ ద్వారా వీరికి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
మోపిదేవి మండల తహసీల్దార్ కె.మస్తాన్.. బాధితుల కుటుంబాలకు 500 రూపాయలతో పాటు నిత్యావసరాలు అందజేశారు. జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్... వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసినా.. పేదలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఇదీ చదవండి: