అమరావతిపై వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలను మరోసారి తిప్పికొట్టారు.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. తన కులం ఉందనో.. తన కుటుంబం కోసమో తాను హైదరాబాద్ ను అభివృద్ధి చేయలేదంటూ ట్వీట్ చేశారు. సైబరాబాద్ నిర్మాణం, శంషాబాద్ విమానాశ్రయ అభివృద్ధి ఏ కులం కోసమో చేసింది కాదని స్పష్టం చేశారు. అలాగే.. అమరావతిని ఏ కులం కోసమో.. ఏ ప్రాంతం కోసమో నిర్మించాలని తాను అనుకోలేదని.. అలాంటి తనపై కులం ముద్ర వేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన రాజధానిని అందించాలన్న సంకల్పం తనదని.. ఐదు కోట్ల కలల రాజధాని అమరావతి అని ట్వీట్ లో చెప్పారు. రాజధాని రైతులకు అండగా నిలిచి పోరాటానికి సిద్ధమవుదామంటూ.. రాష్ట్ర ప్రజలకు, తెదేపా శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: