ETV Bharat / state

CBN on Jagan: ఆయన్ను నమ్ముకున్నోళ్లంతా జైలుకే: చంద్రబాబు

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. తెదేపా అధికారంలో ఉంటే కొవిడ్‌ను కట్టడి చేసేవాళ్లమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా పాలనలో రైతులు, సామాన్యులు ఎవరూ సంతోషంగా లేరని ఆగ్రహించారు.

cbn
చంద్రబాబు
author img

By

Published : Jul 14, 2021, 1:43 PM IST

Updated : Jul 15, 2021, 7:23 AM IST

.

ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, జనంతో మమేకం కాకుండా, కనీసం మాట్లాడకుండా ఆత్మలతో మాట్లాడే ముఖ్యమంత్రి ప్రజలకెందుకని తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించి సొమ్ములు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమా అని నిలదీశారు. బుధవారం ఆయన కృష్ణా జిల్లాలో పర్యటించారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మామ నడికుదిటి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బంటుమిల్లిలో మాజీ ఎమ్మెల్యే దివంగత కాగిత వెంకట్రావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయా నేతల సంతాప సభల్లో చంద్రబాబు మాట్లాడారు. జలవివాదాలపై తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకొనే ధైర్యం లేదా? అని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. తనను ఓడించేందుకు ప్రణాళికలు రచించిన ఈ ఇద్దరూ.. ప్రస్తుతం ఎందుకు మాట్లాడుకోవడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. దిల్లీ మెడలు వంచుతానని చెప్పి, ఇప్పుడు తానే మెడలు వంచుతున్నాడని విమర్శించారు. ‘మద్యం, ఇసుక, విద్యుత్తు ధరలు పెంచారు. చెత్త మీదా పన్ను వేశారు. మిగిలింది జుత్తు మాత్రమే. దానిపైనా వేస్తారేమో’నని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు

కరోనా కట్టడిలో విఫలం
‘కరోనా కట్టడిలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వైరస్‌తో లక్షల్లో జనం చనిపోతే వేలల్లో లెక్కలు చూపిస్తున్నారు. కొవిడ్‌తో చనిపోయినట్లు ధ్రువపత్రం ఇవ్వడం లేదు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మూడో దశ ఉద్ధృతిపై నిపుణులు హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోదు. మాస్క్‌ ధరించకపోతే రూ.100 జరిమానా వేస్తున్న సీఎం.. తాను మాత్రం మాస్క్‌ పెట్టుకోకుండా ఏం సందేశం ఇస్తున్నారు’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

.

పోలవరం పడకేసింది
‘పట్టిసీమను ఏడాదిన్నరలో పూర్తిచేసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చిన ఘనత తెదేపాది. మేం పోలవరం పనులు 75 శాతం పూర్తిచేస్తే, నేడు పడకేసింది. గిరిజనులకు పునరావాసం కల్పించలేకపోయారు. ముంపు బాధితులకు న్యాయం జరిగేవరకు తెదేపా అండగా ఉంటుంది’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ‘అమరావతి నిర్మాణం జరిగితే రూ.లక్ష నుంచి రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చేది. ప్రజల కోసం దండం పెట్టి అడుగుతున్నా.. అమరావతిపై పునరాలోచించాలని. దాన్ని విధ్వంసం చేయొద్దు. చరిత్రహీనుడివి కావొద్దు. హైదరాబాద్‌ అభివృద్ధిని రాజశేఖర్‌రెడ్డి కొనసాగించారు. కానీ విధ్వంసం చేయలేదు. రోడ్లకు తట్టెడు మట్టిపోయలేని వారు మూడు రాజధానులు కడతారా? వీళ్లకు అభివృద్ధి అంటే తెలుసా?’ అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, విజయవాడ లోక్‌సభ పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, కృష్ణా జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ, మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

* చంద్రబాబు కాన్వాయ్‌ మచిలీపట్నంలోకి ప్రవేశించగానే కొందరు నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే కొందరు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ‘కాబోయే సీఎం.. జూనియర్‌ ఎన్టీఆర్‌’ అంటూ జెండాలు ప్రదర్శించారు.

* బచ్చుల అర్జునుడికి బుధవారం స్వల్పంగా గుండెపోటు వచ్చింది. చంద్రబాబు పర్యటనలో పాల్గొన్న అనంతరం ఆయన అస్వస్థతకు గురికావడంతో వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి స్టంట్‌ వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.

.

జగన్‌ను నమ్ముకుంటే జైలుకే

‘సమాజం కోసం, భావితరాల కోసం అవసరమైతే జైలుకు వెళ్తాం. కేసులకు భయపడే పరిస్థితి తెదేపాలో లేదు. పోలీసులు హుందాగా ప్రవర్తించాలి. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. జగన్‌ను నమ్ముకున్న వాళ్లు జైలుకెళ్లారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని అధికారులను చంద్రబాబు హెచ్చరించారు. ‘తెదేపా హయాంలో ఉద్యోగులకు 43 శాతం పీఆర్‌సీ ఇచ్చాం. ఉమ్మడి రాష్ట్రంలో 25శాతం ఇచ్చాం. నేనే అధికారంలో ఉంటే దేశంలో ఎక్కడాలేని విధంగా పీఆర్‌సీ ఇచ్చేవాడ్ని. నేడు ఉద్యోగులు బదిలీలకు భయపడి మౌనంగా ఉంటున్నారు. నిరుద్యోగ భృతి, పెళ్లికానుక ఎత్తేశారు. ప్రభుత్వ ఖజానా వెలవెలబోతుంటే.. భారతి సిమెంట్‌ లాభాల్లో దూసుకుపోతుంది. ప్రజల ఆదాయం, జీవన ప్రమాణాలు దిగజారిపోతుంటే.. జగన్‌రెడ్డి, అనుచరుల ఆదాయం పెరిగింది’ అని విమర్శించారు.

ఇదీ చదవండి:

Penna Cements‌ case: నాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదు: సీఎం జగన్

జమ్ముకశ్మీర్​లో డ్రోన్​ కలకలం- బలగాలు అప్రమత్తం

Last Updated : Jul 15, 2021, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.