ETV Bharat / state

Chandrababu Reaction on Attempt to Murder Case: నాపైనే దాడి చేసి.. హత్యాయత్నం కేసా..?: చంద్రబాబు - చంద్రబాబుపై దాడి

Chandrababu Reaction on Attempt to Murder Case : అంగళ్లలో తనపై హత్యాయత్నం చేసి, తిరిగి తనపైనే హత్యాయత్నం పెడతారా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్ఎస్​జీ, మీడియా, ప్రజల సాక్షిగా జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Attempted_murder_case_against_Chandrababu

author img

By

Published : Aug 9, 2023, 3:23 PM IST

Updated : Aug 9, 2023, 3:58 PM IST

Chandrababu Reaction on Attempt to Murder Case: తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో ఇటీవల జరిగిన ఘర్షణల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ముదివీడు పీఎస్‌లో చంద్రబాబు సహా 20 మందికి పైగా టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సహా నల్లారి కిషోర్‌, దమ్మాలపాటి రమేష్‌, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని తదితరులపై కేసు నమోదు చేశారు. 20 మందితో పాటు ఇతరులంటూ మరికొంత మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 4న మారణాయుధాలు, ఐరన్‌ రాడ్లు, ఇటుకలు, కర్రలు వంటి వాటితో ప్రయాణిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారంటూ ఉమాపతిరెడ్డి ఫిర్యాదు చేశారు.

Attempted_murder_case_against_Chandrababu

Murder Attempt Case On Chandrababu: చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు

Chandrababu Fire on Minister Peddireddy: అంగళ్లలో తనపై హత్యాయత్నం చేసి, తిరిగి తనపైనే హత్యాయత్నం పెడతారా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్ గా మారిన మంత్రి పెద్దిరెడ్డి, అతని సోదరుడు చేస్తున్న 5వేల కోట్ల రూపాయల పైన దోపిడీని ఎండగట్టాననే దాడికి యత్నించారని ఆయన మండిపడ్డారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టును బయటపెట్టాననే అంగళ్లలో దాడికి యత్నించారని చంద్రబాబు(Chandrababu) ఆరోపించారు. అంగళ్లలో దాడి జరగబోతోందని ఎన్ఎస్​జీతో పాటు సీఎస్​ఓ ఎస్పీకి ముందస్తు సమాచారం ఇచ్చినా.. దాడి సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వారి పర్యటన అడ్డుకున్నానా లేక తన పర్యటనను వాళ్లు అడ్డుకున్నారా అనే సూటి ప్రశ్నకు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Demand for CBI investigation: తనపై ఎన్ఎస్​జీ, మీడియా, ప్రజల సాక్షిగా జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరగాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. తనపై అనేక సార్లు ఈ విధంగా దాడులకు పాలడుతున్నారు కాబట్టి ఎవరు తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నారో సీబీఐ విచారణలో తేలాలన్నారు. తనపై చాలా సార్లు దాడికి యత్నించారని మండిపడ్డారు. తెలుగుదేశం శ్రేణులు రోడ్డెక్కకుండా ముందస్తు అరెస్టులు చేసే పోలీసులు, అంగళ్లలో వైసీపీ శ్రేణుల్ని ఎందుకు నియంత్రించలేదని ప్రశ్నించారు. అంగళ్ల ఘటనకు సంబంధించి వివిధ వీడియోలు చంద్రబాబు ప్రదర్శించారు.

TDP Leaders Fire on CM Jagan : 'షేమ్ ఆన్ యూ జగన్ రెడ్డీ..' చర్యకు ప్రతి చర్య తప్పదని టీడీపీ హెచ్చరిక

Babu about Megastear Chiranjeevi: నిన్న చిరంజీవి ఒక్క మాట మాట్లాడితే ఆయనపైనా దాడికి దిగుతారా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ తప్పిదాలపై ఈనాడు వార్తలు రాస్తోందని, మార్గదర్శిపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ పనులు చేసుకుంటే చేసుకోవాలి కానీ మంత్రిగా ఉంటూ కాంట్రాక్టర్ గా ఉండటమేంటని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలు కేసులు పెట్టినా పోలీసులు తీసుకోకపోగా, సంఘటన స్థలంలో లేని వారిపైనా కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. పోలీసుల్ని నేరాల్లో భాగస్వాముల్ని చేస్తున్నారని తాను చెప్తున్నదానికి ఇదే ఉదాహరణ అని తెలిపారు. పిచ్చితనానికి కూడా ఓ హద్దు లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈ కేసులకు తానేమీ భయపడట్లేదని వెల్లడించారు. సీబీఐ (CBI) ఈ కేసుల్ని ఎస్టాబ్లిష్ చేయాలని ప్రధానితో పాటు ఇతర రాజ్యాంగ పెద్దలకు లేఖలు రాస్తానని తెలిపారు. న్యాయపరంగా పోరాడుతూనే వైసీపీ తప్పిదాలను ప్రజాక్షేత్రంలో ఎండకడతామని స్పష్టం చేశారు. ఎస్పీ రిషాంత్ రెడ్డిపై మానవ హక్కుల కమిషన్​లో కేసు ఉందని పేర్కొన్నారు. దానితో రిషాంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి పుంగనూరులో దాడుల్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారని చంద్రబాబు తెలిపారు.

Leagal Fight: పోలీసు అధికారులనూ వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారన్న చంద్రబాబు.. దాడి ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ప్రధానితో పాటు ఇతర రాజ్యాంగ పెద్దలకు లేఖలు రాస్తానని, దోషులను ప్రజాక్షేత్రంలో నిలబెట్టే వరకు వదిలిపెట్టనని స్పష్టం చేశారు. న్యాయపరంగా పోరాడుతూనే వైసీపీ తప్పిదాలను ఎండగడతాం అని చెప్పారు. రాష్ట్రంలో అందరిపైనా కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు.. మీడియా, రాజకీయ నాయకులకు రక్షణ లేదని అన్నారు. అధికారమనే పిచ్చిరాయి చేతిలో పెట్టుకొని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంత ఘోరంగా వ్యవహరించి.. కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Lokesh Fire on MLA Kasu Mahesh in Piduguralla Meeting: కొన్ని నెలలు ఓపిక పట్టండి.. క్యాష్ మహేష్​ను పిల్లి మహేష్​ చేస్తాం: లోకేశ్

Last Updated : Aug 9, 2023, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.