ETV Bharat / state

Chandrababu Power Point Presentation: నదుల అనుసంధానానికి దేశంలోనే తొలిసారి పునాది వేసింది టీడీపీ: చంద్రబాబు - నారా చంద్రబాబు నాయుడు

Chandrababu Power Point Presentation: గోదావరి-పెన్నా లింక్​లో భాగంగా సాగర్ కుడి కాల్వ నుంచి సోమశిల లింక్ ప్రాజెక్టును వైసీపీ ఏమాత్రం పరిగణించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. ఎన్టీఆర్ ఆలోచనతో నెల్లూరు జిల్లాకు 146 టీఎంసీలతో సోమశిల కండలేరు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టామన్న చంద్రబాబు.. సోమశిల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2020 కల్లా పూర్తి చేస్తామన్న జగన్ హామీ నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu_Power_Point_Presentation
Chandrababu_Power_Point_Presentation
author img

By

Published : Aug 6, 2023, 1:27 PM IST

నదుల అనుసంధానానికి దేశంలోనే తొలిసారి పునాది వేసింది టీడీపీ: చంద్రబాబు

Chandrababu Power Point Presentation on Irrigation Projects in Joint Nellore District: సమగ్ర ప్రణాళికతో గోదావరి నుంచి సోమశిల ద్వారా నెల్లూరుకు నేరుగా నీళ్లు తీసుకురావొచ్చునని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. గోదావరి-పెన్నా లింక్ లో భాగంగా సాగర్ కుడి కాల్వ నుంచి సోమశిల లింక్ ప్రాజెక్టును వైసీపీ ఏమాత్రం పరిగణించలేదని దుయ్యబట్టారు. తెలుగు గంగ ప్రాజెక్టు సరైన నిర్వహణ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఆలోచనతో నెల్లూరు జిల్లాకు 146 టీఎంసీలతో సోమశిల కండలేరు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టామన్న చంద్రబాబు.. శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి కృష్ణా జలాలను పెన్నాలో కలిపి దేశంలోనే మొట్టమొదటి నదుల అనుసంధానానికి ఈ ప్రాజెక్టు పునాది వేసిందన్నారు. ఆయకట్టు పెంచేందుకు ఎటువంటి చర్యలు లేవని, లైనింగ్ పనులు పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు.

CBN fire on CM Jagan: 'సీఎం జగన్ రాయలసీమ ద్రోహి.. వైఎస్సార్​సీపీకి కమీషన్లపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదు' చంద్రబాబు ధ్వజం

Kandaleru Lift irrigation సోమశిల ప్రాజెక్టు మిగిలిన పనులు 2020 కల్లా పూర్తి చేస్తామన్న జగన్ హామీ నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కండలేరు రిజర్వాయర్ కు 2014లో అటవీ శాఖ అనుమతులు తెచ్చి... మరో లక్షా 30 వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాగుకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. వైసీపీ ఆయకట్టు పెంచేందుకు ఎటువంటి చర్యలు లేకపోగా మెయింటెనెన్సు లేదన్నారు. లైనింగ్ పనులు పట్టించుకోవడం లేదని, కండలేరు లిఫ్ట్ ఆయకట్టు పెంచేందుకు ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక పోవడంతో పనులు ఆగిపోయాయన్నారు.

Payyavula on Rayalaseema project సీబీఐ విచారణకు ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నాం.. త్వరలో లేఖ: పయ్యావుల

Reverse Tendering ఆల్లూరుపాడు ప్రాజెక్టు ను రివర్స్ టెండరింగ్ పేరుతో డ్రామా ఆడి టెండర్లు రద్దు చేశారని మండిపడ్డారు. సంగం బ్యారేజీ కేవలం మిగతా 17 శాతం పనులకు మూడున్నరేళ్లు పైగా తీసుకొని పనులు పూర్తి చేయకుండానే పేరు మార్చి హడావుడిగా ప్రారంభోత్సవం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తికానందు వల్ల పాత పద్ధతిలోనే నీటి విడుదల, బ్యారేజీ నుంచి కాల్వలకు తాగునీరు సరఫరా జరగడంలేదన్నారు. నెల్లూరు బ్యారేజీకి 10శాతం పనులు మిగిలి ఉండగానే ప్రారంభోత్సవం చేసేశారని, నెల్లూరు ప్లడ్ బ్యాంక్స్ బిల్లులు సక్రమంగా చెల్లించనుందున పనులు మందకొడిగా సాగుతున్నాయని దుయ్యబట్టారు.

TDP Leader Chandrababu naidu సాగునీటి రంగంలో వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఐదు నదులు అనుసంధానం చేస్తే ఆంధ్రప్రదేశ్ కు నీటి కష్టాలు ఉండవని తెలిపారు. నీళ్లను సద్వినియోగం చేసుకుంటే సిరులు పండించవచ్చునన్నారు. సోమశిల, కండలేరు పనులకు బిల్లులు చెల్లించక పోవటంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశారని తెలిపారు. 2021లో 5.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్న చంద్రబాబు.. పెండింగ్ బిల్లులు ఆపివేసి పనులు నిలిచిపోవడంతో సోమశిల డ్యామ్ కు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. గండిపాలెం రిజర్వాయర్ కాలువల పూడికతీయకపోవటంతో పాటు నిర్వహణ గాలికి వదిలేశారని ఆక్షేపించారు. పెద్దిరెడ్డి సాగర్ రిజర్వాయర్ పనులు మొదలుపెడితే ఇపుడు బిల్లులు చెల్లించకపోవటం తో పనులు ఆగిపోయాయని విమర్శించారు. మలిదేవి డ్రైన్ కోసం గతంలో 93 కోట్లు మంజూరు చేస్తే ఇపుడు కేవలం మట్టి పనులు మాత్రమే చేసి అధిక బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. పెండింగ్ బిల్లుల కారణంగా డీఎం ఛానల్, డీఆర్ ఛానల్, సోమశిల ఖండలేరు వరదకాలువ పనులు ఆగి పోయాయని దుయ్యబట్టారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించారు. ప్రాజెక్టులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు.

Chandrababu fire on Jagan: 'నాలుగేళ్లలో 4 శాతమే ప్రాజెక్టుల పనులు.. సిగ్గనిపించడం లేదా జగన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.