కృష్ణాజిల్లా... వైకాపా బాధితులతో తెదేపా అధినేత చంద్రబాబు... విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో సమావేశమయ్యారు. పేదలపై పెత్తనం చేస్తామంటే సహించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ తన మంత్రులను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పోలీసులు చట్టపరంగా ప్రవర్తించకుంటే వారికి శిక్ష పడేవరకు పోరాడతామన్నారు. డీజీపీకి ఐపీఎస్ డిగ్రీ ఇచ్చింది... తప్పుడు కేసులు బనాయించడానికి కాదని హితవు పలికారు.
పార్టీ మారాలంటూ... హింసించారు...
పార్టీ మారాలంటూ... తనను చిత్రహింసలకు గురిచేశారని జయలక్ష్మి అనే ఆశా వర్కర్... చంద్రబాబు ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. ఎస్సీ మహిళ అయిన తనను... ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఒత్తిడి చేసినట్లు చెప్పారు. మంత్రి పేర్ని నాని ఇబ్బందులకు గురిచేయడం కారణంగానే... తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డానని చెప్పింది. ఒత్తిళ్లకు కుంగిపోవద్దని... ధైర్యంగా పోరాడాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ధైర్యంగా ఉండండి...
బాధితులందరూ ధైర్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. పార్టీ తరఫున ప్రైవేట్ కేసులు వేసి మంత్రుల్ని బాధ్యులుగా చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని హామీఇచ్చారు. పేదలపై పెత్తనం చేస్తే... ఊరుకొబోమని హెచ్చరించారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా... తాము పార్టీ మారమని... ఈ సందర్భంగా కార్యకర్తలు అధినేతకు చెప్పారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు తన ప్రాణాన్నైనా... అడ్డువేస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి : 'బాధితులకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి'