కృష్ణా జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు సేవలను పలువురు నేతలు కొనియాడారు.
విజయవాడలో..
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమంలో పోలీస్ హౌసింగ్ బోర్డ్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెదేపాతోనే సాధ్యం అయిందని ఎమ్మెల్సీ వెంకన్న అన్నారు.
అవనిగడ్డలో..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అవనిగడ్డ తెదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. చంద్రబాబు.. నేటితరం సమస్యలు తీరుస్తూనే ముందుతరాల గురించి ఆలోచించగలిగే గొప్ప రాజనీతిజ్ఞుడని బుద్ధప్రసాద్ కొనియాడారు.
నందిగామలో..
నందిగామలోని తెదేపా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భారీ కటౌట్‌కు పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
గుడివాడలో..
గుడివాడలో నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండల తెదేపా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి