పేదల ఆకలిని, కష్టాలను తొంగిచూసిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని చంద్రబాబు, లోకేశ్ నివాళులర్పించారు. ప్రతి తెలుగువాడు గర్వించేలా సినీ, రాజకీయ రంగాల్లో అసాధారణ చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ విశ్వవిఖ్యాతుడి ఆదర్శాలను, ఆశయాలను మననం చేసుకుంటూ..ప్రజాసేవలో స్ఫూర్తిని పొందుదామని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ జీవితం అప్పుడప్పుడూ స్మరించుకునే చరిత్ర కాదని, ప్రతిరోజూ చదవాల్సిన స్ఫూర్తి పాఠమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్యుడిగా, చారిత్రాత్మక నాయకుడిగా ఎదిగేందుకు కృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీలను ఆయన వ్యక్తిత్వంలోనూ, జీవితంలోనూ భాగం చేసుకున్నారని వివరించారు. సాటి మనిషిని నిస్వార్థంగా ఆదుకోవడంలో ఎన్టీఆర్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మానవతావాది ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని సమసమాజ స్థాపనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి...