ETV Bharat / state

'ప్రమాదాలు జరుగుతున్నా.. కంపెనీలకే వైకాపా వత్తాసు పలుకుతోంది'

author img

By

Published : Jul 14, 2020, 3:12 PM IST

పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసి.. తప్పుడు కేసులతో ప్రతిపక్ష నాయకులపై కక్ష తీర్చుకోవాలని చూస్తోందని మండిపడ్డారు.

chandra babu
chandra babu

15 రోజుల్లో 2 దుర్ఘటనలు.. 2నెలల్లో 3 కంపెనీల్లో ప్రమాదాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీ సీనియర్ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్జీ పాలిమర్స్ ఉదంతం, సాయినార్ కెమికల్స్, రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్స్​లో వరుసగా దుర్ఘటనలు జరిగాయని చంద్రబాబు అన్నారు. బాధితులను ఆదుకునే చర్యలు తీసుకోకుండా.. కంపెనీలకే వైకాపా సర్కార్​ వత్తాసు పలుకుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రమాదాల నివారణపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం హేయమన్నారు. తమ వైఫల్యాలకు తెదేపాపై నిందలు వేయడం వైకాపా నాయకులకు దురాలవాటుగా మారిందని మండిపడ్డారు. లక్షల పరీక్షలు చేశామని గొప్పలు చెప్పడం కాదని.. వైరస్ టెస్టింగ్ ఫలితాలు ఎంత త్వరగా ఇస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. వారాల తరబడి ఫలితాల్లో జాప్యం వల్లే ఏపిలో కరోనా వైరస్ విజృంభిస్తోందని అన్నారు. దీనికి వైకాపా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

రాష్ట్రంలో కరోనా చికిత్సపై వైకాపా మంత్రులకే నమ్మకం లేదని చంద్రబాబు విమర్శించారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తిరుపతి ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి.. హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట అన్నారు. కరోనా నియంత్రణ కన్నా.. కక్ష సాధించడంపైనే వైకాపా దృష్టి పెట్టిందని మండిపడ్డారు.

ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు, చేతివృత్తుల వారికి ప్రత్యేక ప్యాకేజి అందించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఇళ్ల స్థలాలకు భూసేకరణలో, మెరక వేయడంలో వైకాపా అవినీతిని ప్రజల్లో ఎండగట్టాలన్నారు. ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసి.. తప్పుడు కేసులతో ప్రతిపక్ష నాయకులపై కక్ష తీర్చుకోవాలని చూస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు.. ఒక్క రోజులోనే 43 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.