ETV Bharat / state

వైకాపా ప్రభుత్వ వైఫల్యానికి నీతిఅయోగ్ నివేదిక నిదర్శనం - chandra babu fires on ycp government

ఎగుమతుల సన్నద్దత సూచి- 2020లో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉండటంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వైకాపా పాలన వైఫల్యానికి ఇది నిదర్శనమని దుయ్యబట్టారు.

chandra babu
చంద్రబాబు
author img

By

Published : Aug 28, 2020, 4:17 AM IST

నీతి అయోగ్ బుధవారం విడుదల చేసిన "ఎగుమతుల సన్నద్దత సూచి- 2020" లో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉండటం విచారకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అతి పొడవైన తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్రం... కనీసం ఇతర 8 తీర ప్రాంత రాష్ట్రాలతో కూడా పోటీ పడలేక 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పోర్టులు లేకున్నా తెలంగాణ 6వ స్థానంలో ఉంటే... 11 మైనర్ పోర్టులు, 1మేజర్ పోర్టు ఉన్నప్పటికీ ఏపీ ఇలా దిగజారడం.. వైకాపా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. తీరప్రాంత రాష్ట్రమైనా పాలసీపరంగా ఏపీ పనితీరు నాసిరకంగా ఉందని నీతి అయోగ్ వ్యాఖ్యానించడం కన్నా అవమానం ఏముందని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.