కృష్ణా జిల్లా నూజివీడులో ఒకే రోజు రెండు ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. పట్టణలోని న్యూ ఎంప్లాయిస్ కాలనీలోని ఓ ఇంట్లో టీవీ చూస్తున్న తోట ప్రమీల అనే గృహిణి మెడలో నుంచి రూ. 3.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో దుండగులు పరారయ్యారు. ఈ ఘటన నుంచి తేరుకున్న బాధితురాలు లబోదిబో మనగా స్థానికులు దొంగల కోసం వెతికినా ఫలితం లేదు. బాధితురాలు నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అన్నవరం వెళ్లే మార్గంలోని బైపాస్ రోడ్డు వద్ద టీ దుకాణం యజమానురాలు మెడలోంచి ఆదివారం తెలవారుజామున బంగారం నాను తాడు గొలుసు చోరీకి గురైంది. ఈ ఘటన నుంచి తేరుకోక ముందే న్యూ ఎంప్లాయిస్ కాలనీలో మరో దొంగతనం జరగడం పట్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ రెండు ఘటనలు పోలీసులకు సవాలుగా మారాయి. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పట్టణ ఎస్సై గణేష్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చూడండి: