దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే... కార్మిక సంక్షేమానికి సంబంధించిన నిధులను ఉత్తరాది రాష్ట్రాలు సమగ్రంగా వాడుతున్నాయని జాతీయ కార్మిక సంక్షేమ సంస్థ ఛైర్మన్ జయప్రకాశ్ నారాయణ తెలిపారు. విజయవాడలో మాట్లాడిన ఆయన... దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమన్నారు. త్వరలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ రాష్ట్రంలో పర్యటిస్తారని వెల్లడించారు. ప్రజాసమస్యలు, కార్మిక సంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాల వివరాలను అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి: