వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను ఆమోదింపచేసి రైతుల నడ్డి విరిచిందని సీపీఎం నందిగామ మండల కార్యదర్శి కే. గోపాల్ అన్నారు. విద్యుత్ చట్టానికి సవరణలు చేసి కార్పొరేట్లకు కట్టబెట్టి సబ్సిడీలు ఎత్తివేసే చర్యలకు పూనుకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో కొన్ని సంక్షేమ చర్యలు చేపట్టినా ప్రజల ఉపాధి ఆదాయాలు పెంచేందుకు కనీస చర్యలు చేపట్టలేదని విమర్శించారు. అసంఘటిత రంగ కార్మికులకు ఉపయోగపడే కనీసవేతనాల బోర్డును నియమించలేదన్నారు. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు కరోనా సహాయం అందించలేదని ఆరోపించారు. దళితుల రక్షణ కోసం విజిలెన్స్ ,మానిటరింగ్ కమిటీ సమావేశం పరచలేదన్నారు. పట్టణాల్లో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని పేదలు కోరుతున్నారని...యూజర్ చార్జీలు, ఆస్తి విలువలు ఆధారంగా ఆస్తిపన్ను పెంపు, పెంపు విద్యుత్ ఛార్జీల పెంపు వద్దని ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గోపాల్ మండిపడ్డారు. రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించకుండా ప్రాంతాల మధ్య తగవులు పెట్టడం, రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీ పడటం క్షమించరాని నేరమన్నారు.
కేంద్రం పేదలను ఆదుకోవాలి: సీపీఎం డిమాండ్ - krishna newsupdates
కేంద్ర ప్రభుత్వం పేదలను ఆదుకోవాలని, కేరళ రాష్ట్రం తరహాలో ప్రజలకు నిత్యావసరాలు అందించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు భాగంగా నందిగామ మండలం అంబారుపేటలో కరపత్రాలు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా కరోనా వైపరీత్యం ప్రజల ఉపాధిని దెబ్బతీసిందని, ప్రజల ఆదాయాలు అడుగంటి అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని... సీపీఎం నందిగామ మండల కార్యదర్శి కె.గోపాల్ అన్నారు.