ETV Bharat / state

విజయవాడ చేరుకున్న సీఈసీ బృందం - జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం

Central Election Commission Team Andhra Pradesh Visit: రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం బృందం విజయవాడకు చేరుకుంది. సీఈసీ రాజీవ్‌కుమార్‌, చంద్రపాండే, అరుణ్‌గోయల్ రాష్ట్రానికి చేరుకున్నారు. సీఈసీ బృందానికి కృష్ణా జిల్లా కలెక్టర్‌, ఎస్పీ స్వాగతం పలికారు. కేంద్ర ఎన్నికల బృందం నేటి నుంచి 3 రోజుల పాటు విజయవాడలో ఉండనుంది.

Central_Election_Commission_Team_Andhra_Pradesh_Visit

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2024, 10:37 PM IST

Central Election Commission Team Andhra Pradesh Visit: కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం విజయవాడకు చేరుకున్నారు. దిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చారు. విమానాశ్రయంలో సీఈసీ బృందానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ జాషువా, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సీఈసీ బృందం నేటి నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024 సహా ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా సమీక్షించనుంది. ఈ మేరకు 9, 10 తేదీల్లో భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సహా, ఎన్నికల కమిషనర్లు విజయవాడలో రాజకీయ ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు.

9 తేదీన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ సహా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ప్రతినిధులతో సమావేశం కానున్న సీఈసీ వారి నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలపై చర్చించనున్నారు.

అనంతరం 2024 ఓటర్ల తుది జాబితాతో పాటు ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే సీఎస్, డీజీపీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సమావేశం కానున్నారు. జ‌న‌వ‌రి 10వ తేదీన రాష్ట్ర చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్‌, స్టేట్ పోలీస్ నోడ‌ల్ ఆఫీస‌ర్‌, సీఏపీఎఫ్ నోడ‌ల్ ఆఫీస‌ర్ త‌దిత‌రుల‌తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల‌తో సీఈసీ సమావేశం కానున్నారు. అనంతరం సీఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

ఎన్నికల నగారా మోగే నాటికే స‌మ‌గ్ర ప్రణాళిక‌తో సిద్ధంగా ఉండాలి : సీఈసీ బృందం

Chandrababu Pawan Kalyan Meet Central Election Commission: రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ, జనసేన అధినేతలు కలవనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను చంద్రబాబు (Chandrababu Naidu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కలిసి రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు. దీంతో మంగళవారం ఉదయం వెంకటగిరిలో జరగాల్సిన రా కదలిరా బహిరంగ సభను సైతం వాయిదా వేశారు.

AP CEO Mukesh Kumar Meena on Voters List: మరోవైపు రాజకీయ పార్టీలు ఫిర్యాదులై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా వివరాలు వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి లేఖ రాశారు. అనర్హమైన 5.64 లక్షల ఓట్లు తొలగించినట్లు తెలిపారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఇద్దరు ఈఆర్వోలను సస్పెండ్ చేశామని, 50 మంది బీఎల్వేలపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. గంపగుత్త ఫామ్‌-7లపై కాకినాడ నగరంలో 13 మంది, పర్చూరులో 10 మంది, గుంటూరు పశ్చిమలో ఆరుగురిపై కేసు పెట్టామన్నారు. జీరో డోర్ నెంబర్లు, ఒకే ఇంటిలో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న కేసుల్లో 97 శాతం తనిఖీలు పూర్తిచేసి జాబితాను సవరించామని తెలియజేశారు.

ఏపీలో ప్రారంభమైన ఎన్నికల హడావిడి - అధికారుల బదిలీలు, పోస్టింగులపై ఈసీ మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.