జాతీయ పతకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తైన సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ అవగాహన ర్యాలీని విజయవాడలో నిర్వహించారు. సరిగ్గా వందేళ్ల క్రితం 1921 మార్చి 31న విజయవాడలో బాపు మ్యూజియం వద్ద గాంధీజీ పింగళి వెంకయ్యను పిలిపించి స్వాతంత్ర సమరయోధుల ముందు జాతీయ పతాకాన్ని ఖరారు చేశారు.
త్రివర్ణ పతాకం ఆవిష్కరణ..
మరుసటి రోజు 1921 ఏప్రిల్ 1న విజయవాడ జింఖానా మైదానంలో పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ శత వసంత సందర్భాన్ని పురస్కరించుకుని బాపు మ్యూజియం నుంచి జింఖానా మైదానం వరకు ప్రజాపతి నేషనల్ ఆంథమ్, నేషనల్ ఫ్లాగ్ ట్రస్ట్ అండ్ సొసైటీ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య విగ్రహం నుంచి అవగాహన ర్యాలీని చేపట్టారు.