కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు ప్రజలంతా వారి వారి ఇళ్లలో చేసుకోవాలని కృష్ణాజిల్లా గుడివాడ ఆర్డీఓ శ్రీనీకుమార్ సూచించారు. డివిజన్ పరిధిలోని కైకలూరు ,మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి, పామర్రు పెదపారుపూడి ,గుడివాడ ,నందివాడ మండలాల్లోని ప్రధాన కూడళ్లలో వినాయక ఉత్సవ విగ్రహాలు పెట్టి.. పందిళ్లు వేసి.. ఉత్సవాలు చేయకూడదని తెలిపారు.
ఉత్సవ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. తమ తమ ఇళ్లలోనే పూజలు జరుపుకోవాలని ఆర్డీవో ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: త్వరలో అందుబాటులోకి... కొవిడ్ నిర్ధరణకు కొత్త యంత్రం