ys vivekamurder case : ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించేందుకు సీబీఐ కోర్టు అంగీకరించింది. భాస్కర్‌రెడ్డికి ప్రత్యేక కేటగిరీ కల్పించాలని హైదరాబాద్ జిల్లా మేజిస్ట్రేట్‌కు సీబీఐ న్యాయస్థానం సిఫార్సు చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన భాస్కర్‌రెడ్డి గత నెల 16 నుంచి చంచల్‌గూడ జైళ్లో ఉన్నారు. తన వయసు, అనారోగ్యం, సామాజిక స్థితి తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక కేటగిరీ కల్పించాలని భాస్కర్ రెడ్డి కోరారు. మరోవైపు భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 5కి వాయిదా వేసింది.
ITR Filing Compulsory : ఆదాయం లేకపోయినా ఐటీ రిటర్నులు తప్పనిసరా?
మరణించే ముందు వివేకానంద రెడ్డి రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలన్న సీబీఐ ప్రయత్నంపై నిందితులు అభ్యంతరం తెలిపారు. సీబీఐ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ గంగిరెడ్డి, సునీల్ యాదవ్ కౌంటర్లు దాఖలు చేశారు. అభ్యంతరం వ్యక్తం చేస్తూ శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తన నుంచి ఎలాంటి కౌంటరు లేదని అప్రూవర్ దస్తగిరి తెలిపారు. సీబీఐ తరఫున వాదనల కోసం పిటిషన్‌ను ఈనెల 5కి న్యాయస్థానం వాయిదా వేసింది. వివేకా హత్య కేసు ట్రయల్‌లో సీబీఐ పీపీకి సహకరించేందుకు తనకు అనుమతివ్వాలన్న సునీత పిటిషన్‌పై కూడా నిందితులు అభ్యంతరం తెలిపారు. గంగిరెడ్డి, సునీల్ యాదవ్ కౌంటర్లు దాఖలు చేయగా.. శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి వాదనలు వినిపించారు. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కౌంటర్లు దాఖలు చేయలేదు. పిటిషన్‌పై వాదనలు వినిపించాలని సునీతను ఆదేశించిన కోర్టు విచారణను ఈనెల 5కి వాయిదా వేసింది.
'పెళ్లి వార్తలు పట్టించుకోకుండా పిజ్జా తింటున్నావా? వరుణ్ బ్రో!.. లావణ్య ఎక్కడ?'
ఎవరా రహస్య సాక్షి.. వివేకా హత్య కేసులో రహస్య సాక్షిని తెరపైకి తెచ్చిన సీబీఐ.. గత సంఘటనల దృష్ట్యా ఇప్పుడే బయటపెట్టలేమని స్పష్టం చేసింది. రాజకీయ కుట్ర కోణంలో హత్య జరిగిందని సీబీఐ పేర్కొంది. వివేకానందరెడ్డికి కడప ఎంపీ సీటు అవినాష్ రెడ్డికి ఇవ్వడం ఇష్టం లేదని, కావాలంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారని రహస్య సాక్షి వాంగ్మూలం ఇచ్చారని తెలిపింది. ఏప్రిల్ 26న నమోదు చేసిన ఈ వాంగ్మూలాన్ని వచ్చే ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేస్తామని తెలిపింది. అంతేగాకుండా సాక్షిగానూ పరిగణిస్తామని స్పష్టం చేసింది.
గత అనుభవాల నేపథ్యంలో.. గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా.. ప్రస్తుత పరిస్థితుల్లో సాక్షి పేరును బయటపెట్టలేమని సీబీఐ స్పష్టం చేసింది. గతంలో వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం, సీఐ శంకరయ్య రెండోసారి వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించడం వంటి పలు సంఘటనలు ఇందుకు కారణమని పేర్కొంది. సీల్డ్ కవర్‌లో సమర్పిస్తామని, దానిని పరిగణనలోకి తీసుకోవాలని కోరగా.. పిటిషనర్‌కు ఇవ్వకుండా, వారి వాదన వినకుండా ఉత్తర్వులు జారీ చేయడం సహజ న్యాయసూత్రాలకు, సాధారణ న్యాయ ప్రక్రియకు విరుద్ధమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలా ఉత్తర్వులు జారీ చేయొచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పులు ఏమైనా ఉంటే సమర్పించాలని సీబీఐని ఆదేశించారు.
CBN Comments: 'టీడీపీ అధికారంలో ఉంటే పోలవరం పూర్తయ్యేది.. జగన్ పాలనలో రాష్ట్రం సర్వ నాశనం'