కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని 'క్యాచ్ ది రెయిన్' కార్యక్రమాన్ని నిర్వహించారు. జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా సర్పంచ్ వేల్పుల పద్మ కుమారి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పలు శాఖల అధికారులు, సిబ్బంది ర్యాలీ అనంతరం మానవహారం నిర్వహించారు. ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైందని.. దానిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అధికారులు పేర్కొన్నారు. భూగర్భ జల మట్టం పెంచుకునేందుకు తమవంతు ప్రయత్నం చేయాలన్నారు. నీటిని వృథా చేయరాదు అని నినాదాలు ఇచ్చారు.
ఇవీ చూడండి...: సాగునీరందించి రైతులను ఆదుకుంటాం: సామినేని ఉదయభాను