ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఆక్వా రైతులను కలవరపెడుతోంది. కృష్ణాజిల్లాలో సాగు చేస్తున్న చేపలు, రొయ్యలు జపాన్, ఐరోపా, లాటిన్ అమెరికా దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం ఆక్వా రంగంపై పడటంతో ఎగుమతులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వేసవిలో రొయ్యలు, చేపలు సాగు చేసే రైతులకు అధిక దిగుబడులు వస్తాయి. అయితే ఈ వ్యాధి ప్రభావంతో ఈ ఏడాది ఇతర దేశాలకు ఎగుమతులు నిషేధించడంతో... దేశం పరిధిలోనే ఎగుమతులు సాగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రభావంతో చేపలు, రొయ్యలు కిలో సగటున 20 రూపాయల చొప్పున ధరలు తగ్గినట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. క్రమేపీ ఈ ధరలు ఇంకా క్షీణిస్తాయని వారు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి...కరోనా కాటుకు మరో 86 మంది బలి