కృష్ణా జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థనగర్ తండాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. 30 లీటర్ల నాటుసారా, 25 కిలోల బెల్లం సీజ్ చేయడంతోపాటు 2వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. గ్రామీణా ప్రాంతాల్లో నాటుసారా పూర్తిగా నిషేధించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు. ఎవరైనా సారా తయారీ, విక్రయాలు కొనసాగిస్తే కఠిన శిక్షలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ భూముల్లో.. విక్రయాలకు పాల్పడుతోన్న కేటుగాళ్ల అరెస్ట్