కృష్ణాజిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప బీచ్ వద్ద మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. సముద్ర స్నానానికి వచ్చిన 8 మంది యువకులు గంజాయి సేవిస్తూ మెరైన్ పోలీసులకు చిక్కారు. యువకులు విజయవాడకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ గంజాయి పది గ్రాములు ఉన్నట్లు వెల్లడించారు. ఇంకా వారి వద్ద ఏమైనా గంజాయి ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. యువకుల తల్లితండ్రులను కోడూరు పోలీస్‌స్టేషన్‌కి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.
ఇదీ చూడండి: విశాఖ టు విజయవాడ... వయా యువత..!