కరోనా కష్టకాలంలో నాలుగు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తమకు వేతనాలు అందేలా చూడాలని 1902 కాల్ సెంటర్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. విజయవాడ గొల్లపూడి కార్వే కార్యాలయం ఎదుట ఉద్యోగుల ధర్నా నిర్వహించారు. నాలుగు నెలలుగా జీతాలు చెల్లించట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పచ్చతోరణం కార్యక్రమం ఉండడంతో కార్వే ఉద్యోగులను నిరసనకు అనుమతి లేదంటూ ఉద్యోగులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కార్యక్రమం అనంతరం విడిచిపెట్టడం వల్ల కార్వే కార్యాలయం ఎదుట జీతాలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు.
ఇవీ చూడండి...