సీఏ కోర్సు ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేయాల్సి అవసరం ఉందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ విశిష్టమైన కోర్సుపై ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించారు. జ్ఞాన ఉత్కర్ష పేరిట విజయవాడలో ఐసీఎఐ,ఎస్ఐఆర్సీ, సంయుక్తంగా నిర్వహంచిన సదస్సును మంత్రి ప్రారంభోత్సవం చేశారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న సదస్సులో ఎస్ఐఆర్సీ చైర్మన్ జామోన్ కె. జార్జ్, విజయవాడ బ్రాంచ్ చైర్ పర్సన్ వై. నాగవల్లి, ప్రముఖ చార్టెట్ అకౌంటెంట్లు , విద్యార్థులు పాల్గొన్నారు. సీఏ ఓ అద్బుతమైన వృత్తి అని మంత్రి అన్నారు. ఛార్టెడ్ అకౌంటెంట్స్ చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి:ద్రౌపదీ ధర్మరాజు ఆలయ బ్రహ్మోత్సవాలు