విజయవాడ వన్ టౌన్ పాత నగరంలోని హనుమంతరావు చేపల మార్కెట్ వద్ద రెండు ఎద్దులు పోట్లాడుకున్నాయి. సుమారు మూడు నిమిషాల పాటు కుమ్ములాడుకున్నాయి. స్థానికులు ఎద్దులపై బకెట్లతో నీళ్లు పోశారు. అయినా చాలా సేపటి వరకు ఎద్దుల పోట్లాట ఆగలేదు. రెండు ఎద్దులు సమీపంలోని మట్టి కుండలు, ఇతర పాత్రలను పగలగొట్టి వీరంగం చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి