ETV Bharat / state

డీజీపీ అంటే డైరక్షన్ ఆఫ్ జగన్ పాలసీగా మార్చేశారు: బుద్ధా వెంకన్న - డీజీపీ గౌతం సవాంగ్​పై బుద్ధా వెంకన్నఆగ్రహం

డీజీపీ గౌతమ్ సవాంగ్​పై తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న విమర్శనాస్త్రాలు సంధించారు. డీజీపీ గౌతం సవాంగ్... డీజీపీ అర్థాన్ని డైరక్షన్ ఆఫ్ జగన్ పాలసీగా మార్చేశారని ఎద్దేవా చేశారు.

buddha venkanna outraged on dgp goutham sawang
తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న
author img

By

Published : Jul 7, 2021, 1:55 PM IST

డీజీపీ గౌతం సవాంగ్... డీజీపీ అర్థాన్ని డైరక్షన్ ఆఫ్ జగన్ పాలసీగా మార్చేశారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు. వైకాపా నేతలు ఆడిందే ఆట పాడిందే పాటగా ఆయన వ్యవహార శైలి ఉందని ధ్వజమెత్తారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తెదేపా నేతలపై కేసుల నమోదు చేస్తున్నారని ఆరోపించారు. మాచర్ల ఘటనలో తనపైనా, బోండా ఉమా మీద హత్యాయత్నం చేసిన వ్యక్తిపై ఇంతవరకూ కేసు పెట్టలేదని తప్పుబట్టారు.

ప్రజలపక్షాన నిలబడకుండా వైకాపా పక్షాన నిలబడితే గౌతం సవాంగ్ కూడా ఎప్పుడో ఒకప్పుడు జైలుకెళ్లాల్సి వస్తుందని అన్నారు. రోజులన్నీ ఓకేలా ఉండవని గ్రహించి ..ఇకనైనా జగన్మోహన్ రెడ్డి భజన మాని శాంతిభద్రతలపై డీజీపీ దృష్టి పెట్టాలని హెచ్చరించారు.

ఇదీ చూడండి.
phone number: నా ఫోన్ నంబర్​ నాకు ఇస్తారా? చావమంటారా?!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.