ETV Bharat / state

జోక్యం చేసుకోండి... సమస్య పరిష్కరించండి: బ్రాండిక్స్ - brandex company's CEO in amaravathi

తమ సంస్థ విస్తరణకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని అంతర్జాతీయ వస్త్ర తయారీ సంస్థ బ్రాండిక్స్.. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది.

brandex company's CEO Ashraf Omar met with the minister at the secretariat
పరిశ్రమల శాఖ మంత్రితో ... బ్రాండిక్స్ సీఈవో భేటీ
author img

By

Published : Dec 16, 2019, 10:00 PM IST

Updated : Dec 17, 2019, 7:51 AM IST

జోక్యం చేసుకోండి... మా సమస్య పరిష్కరించండి: బ్రాండిక్స్ సీఈవో

తమ సంస్థ విస్తరణలో ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వస్త్ర తయారీ సంస్థ బ్రాండిక్స్... పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఆ సంస్థ సీఈవో అష్రఫ్ ఓమర్ సచివాలయంలో మంత్రితో భేటీ అయ్యారు. తమ సంస్థలో దాదాపు 98 శాతం మంది ఉద్యోగులు స్థానికులేనని మంత్రికి తెలిపారు. మరో మూడేళ్లలో 20 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని... పారిశ్రామిక వృద్ధిలో భాగస్వాములం అవుతామని బ్రాండిక్స్ సీఈఓ ‌అన్నారు. ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు తమ సంస్థ ప్రయత్నిస్తోందని బ్రాండిక్స్ ప్రతినిధులు తెలిపారు. బ్రాండిక్స్ సమస్యలు పరిష్కరించి ఆ సంస్థ విస్తరణకు ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి తెలిపారు. గార్మెంట్స్ పాలసీ రూపొందించేందుకు వారి అభిప్రాయాలు తీసుకుంటామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి

అత్తోటలో విత్తనాలు... పూర్వీకుల జ్ఞాపకాలు

sample description
Last Updated : Dec 17, 2019, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.