విజయవాడలోని నేతాజీ కాలనీలో విషాదం జరిగింది. ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి వెంకటరావు.. ఏడాదిన్నర కుమారుడు రుత్విక్ ఆడుకుంటూ.. వెళ్లి గృహానికి సమీపంలోని డ్రైనేజ్‌లో ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఎవరు గమనించకపోవటంతో బాలుడు డ్రైనేజి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
బాలుడు కనింపించక పోవటంతో తల్లిదండ్రులు చట్టుప్రక్కల వెతకగా... బాలుడు డ్రైనేజీలో విగత జీవిగా కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి