ప్రతి ప్రభుత్వానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది... అది గుర్తించి అధికారులు నడుచుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఇప్పటి వరకు వివిధ శాఖల మధ్య సమన్వయం లేదని... అన్ని శాఖల మధ్య సమన్వయానికి మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత మొదట బదిలీల ప్రక్రియ చేపట్టామని గుర్తుచేశారు. చాలామంది సొంత ప్రాంతాల్లోనే ఉద్యోగాలు చేస్తున్నారని... ప్రభుత్వం తరఫున ఉద్యోగులకు కల్పించిన తొలి సౌలభ్యమిదని మంత్రి పేర్కొన్నారు.
వాతావరణం మారిందని అప్రమత్తంగా లేకపోతే విషజ్వరాలు విజృంభిస్తాయని బొత్స అన్నారు. ఇప్పటి నుంచి పురపాలికల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య సమస్యలు ఉంటే శాఖ మొత్తానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ఉగాది నుంచి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 2, 3 నెలల్లో టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు. డిసెంబర్‌లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని... అధికారులు పకడ్బందీగా వాటిని నిర్వహించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి