NVS Reddy on Metro Expansion in Hyderabad: హైదరాబాద్‌లో మెట్రో విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించామని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. రెండో దశలో 6 కారిడార్లతో 116.4 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళిక రచించామని ఆ తెలిపారు. ప్రస్తుతం 5 కారిడార్లకు డీపీఆర్ సిద్ధం చేసి పంపించామని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో పాల్గొన్న ఎన్వీఎస్‌రెడ్డి మెట్రో విస్తరణపై మాట్లాడారు. ఇంకా 4 శాతం నిధులు పీపీపీ నుంచి సేకరించాలని కేంద్రం షరతు పెట్టినా నిధుల విషయంలో మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి నుంచి స్పష్టమైన హామీ ఉందని ఆయన తెలిపారు. మెట్రోరైలు 7 సంవస్తరాలు పూర్తి చేసుకుందని, ఇది నగర వాసులకే కాకుండా తెలంగాణ ప్రజలకు గర్వకారణమని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.
ముంబయి, చెన్నైలో రూ. లక్షల కోట్లతో మెట్రో విస్తరిస్తున్నారని విస్తరణ లేకపోవడంతో హైదరాబాద్ 3వ స్థానంలో ఉందని ఎన్వీఎస్‌రెడ్డి అన్నారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే 9వ స్థానానికి పడిపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో మెట్రో విజయవంతంగా నడుస్తోందని, 3 కారిడార్లు విమానాశ్రయానికి కలిపేలా రెండో దశ ప్రతిపాదన రూపొందించినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్టుకు ముందు 1.6 కి.మీ మేర భూగర్భంలో మెట్రో ఉంటుందని తెలిపారు.
ఆ BMW కార్లు ఎక్కడ? - పవన్ కల్యాణ్ ఆరా - తమకేం తెలియదంటున్న అధికారులు
నాలుగేళ్లల్లో పూర్తి: ప్రస్తుతం చాలా మంది ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు చైనాలో చేసేవారు. మెట్రోకు సంబంధించిన ఎంత నిధులు కావాలన్నా విడుదల చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కేంద్రం ఆమోదం ఇవ్వకముందే పనులన్నీ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. రెండో దశలో ఎలాంటి సమస్యలు రావు. ఈ పనులన్నీ నాలుగేళ్లల్లో పూర్తి చేస్తామనే నమ్మకం ఉంది' -ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో ఎండీ
పాతబస్తీ మెట్రోకు నిధులు: పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ వరకు ఒక పూర్తి కారిడార్ ఉంటుందని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. తొలి దశలో రోజుకు 5 నుంచి 7 లక్షల మంది ప్రయాణిస్తారని రెండవ దశలో రోజుకు 10 లక్షల మంది ప్రయాణిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. పాతబస్తీ మెట్రోకు ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వివరించారు. పాతబస్తీలో భూసేకరణకే పెద్ద ఎత్తున నిధులు ఖర్చవుతుందని అన్నారు.
ఏపీలోనూ "హైటెక్ సిటీ" నిర్మాణం - 2029 నాటికి 5లక్షల వర్క్స్టేషన్లు : చంద్రబాబు
పోలీసులను వారి పనులను చేసుకోనివ్వండి - నా పని నేను చేస్తా : దిల్లీలో పవన్ కల్యాణ్