ETV Bharat / state

పాఠశాలలకు సకాలంలో పాఠ్యపుస్తకాలు - ప్రభుత్వ

ఏటా వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కాగానే వినిపించే మాట పాఠ్య పుస్తకాల కొరత. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగైదు నెలలైనా పుస్తకాలు పూర్తి స్థాయిలో చేరేవి కావు. ఈసారి విద్యార్థులకు ఆ సమస్య రాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

పాఠశాలలకు సకాలంలో పాఠ్యపుస్తకాలు
author img

By

Published : Jun 7, 2019, 6:44 PM IST

పాఠశాలలకు సకాలంలో పాఠ్యపుస్తకాలు

పాఠశాలల పునః ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పుస్తకాలు పంపిణీ చేసేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బడులు తెరిచే నాటికే పుస్తకాలు అందించాలన్న లక్ష్యంతో పంపిణీ చురుగ్గా చేస్తోంది. కృష్ణా జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కలిపి 13 లక్షల 32 వేలకుపైగా పుస్తకాలు కావాలని అధికారులు తెలపగా.. ఇప్పటికే 10 లక్షల 28 వేల 250 పుస్తకాలు స్కూళ్లకు చేరాయి. మరో 3 లక్షలకుపైగా పంపిణీ పూర్తి కావాల్సి ఉంది.

జిల్లా పరిధిలోని 50 మండలాలకు 2 విడతలుగా పుస్తకాలు అందిస్తున్నారు. గతంలో జిల్లా విద్యాశాఖ నుంచి మండల ఎమ్మార్సీ భవనాలకు పుస్తకాలు చేరవేసేవారు. ప్రస్తుతం పాఠశాలల వద్దకే నేరుగా పంపిస్తున్నారు. ప్రధానోపాధ్యాయలకు ఇబ్బందుల్లేకుండా ఆర్టీసీతో ఒప్పందం చేసుకున్న విద్యాశాఖ... అన్ని పాఠశాలలకు నేరుగా పార్సిల్ చేస్తోంది.

కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పేరుతో ప్రత్యేక వెబ్​సైట్ ద్వారా ఏ మండలానికి ఎన్ని పుస్తకాలు కావాలనే విషయాన్ని అంతర్జాలంలో పొందుపరుస్తున్నారు. ఎన్ని పుస్తకాలు కావాలనే విషయంలో గందరగోళం లేకుండా పక్కా సమాచారం అందుతోంది. అందుకు తగిన విధంగా విద్యాశాఖ పుస్తకాలు ముద్రించి మండలాల వారీగా పంపిణీ చేస్తోంది.

ఇవీ చదవండి..

నీట్​లో మెరిసిన కడప అమ్మాయి

Intro:kit 736
కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511..

అరటి నార ఉత్పత్తి ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులు
వాయిస్ బైట్స్

Body:అరటి నార ఉత్పత్తి ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులు
వాయిస్ బైట్స్

Conclusion:అరటి నార ఉత్పత్తి ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులు
వాయిస్ బైట్స్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.