పోలవరం సహా ప్రతి ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుందని సాక్షాత్తూ ప్రధానమంత్రే ఆక్షేపించినట్లు భాజపా ఎమెల్సీ మాధవ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని....అలా చేస్తే తామూ సహకరిస్తామన్నారు. వైకాపా 100 రోజుల పాలనలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొన్ని బిల్లులు ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రభుత్వ వైఖరి కారణంగా ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయి లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. నేటి క్యాబినెట్ సమావేశంలో రివర్స్ టెండరింగ్‌పై ముందుకు వెళ్తామని చెప్పటం ప్రభుత్వ ఏకపక్ష ధోరణికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవినీతి జరిగిన పనులు, ప్రాజెక్టులు మినహా...మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి.