ETV Bharat / state

ఏపీకి రుణాలివ్వాలంటే బ్యాంకులు భయపడుతున్నాయి: భాజపా

author img

By

Published : Dec 25, 2020, 10:13 AM IST

వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని భాజపా ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ విమర్శించారు. ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇవ్వలేదని బ్యాంకుల ముందు చెత్తపోయడం సరైన చర్య కాదన్నారు. ఈ తరహా చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వం అపహాస్యం పాలవుతుందన్నారు.

bjp MLC madhav
bjp MLC madhav

వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చటం వల్లే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు భయపడుతున్నాయని ఎమ్మెల్సీ, భాజపా ప్రధాన కార్యదర్శి పీవీఎన్‌ మాధవ్‌ విమర్శించారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇవ్వలేదని బ్యాంకుల ముందు చెత్త వేయడం సరైన చర్య కాదన్నారు. బ్యాంకులు రుణాలు ఎందుకు ఇవ్వడం లేదో ఆలోచించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ తరహా చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వం అపహాస్య పాలవుతుందన్నారు. సంక్షేమం పేరుతో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని మాధవ్ దుయ్యబట్టారు.

సర్కార్ సరిగ్గా లేదు

రాష్ట్రంలో అతివలపై వరుస అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ అన్నారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా హోం మంత్రి, ముఖ్యమంత్రి కళ్లు, చెవులు మూసుకున్నారా అని ప్రశ్నించారు. అనంతపురంలో దళిత యువతి స్నేహలత హత్యపై ప్రభుత్వం స్పందించిన తీరు సరిగా లేదని ఆరోపించింది. మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించటంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. స్నేహలతను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

బ్యాంకుల ముందు చెత్త వేయడంపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.