కృష్ణా జిల్లా భాజపా జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి లంకల మల్లారెడ్డి హత్యకు గురయ్యారు. వత్సవాయి మండలం చిట్యాల - లింగాల గ్రామాల మధ్యనున్న మామిడి తోటల్లో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కార్యకర్తలతో కలిసి వత్సవాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మల్లారెడ్డి.. అర్ధరాత్రి ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించి దాడి చేసినట్లు నందిగామ డీఎస్పీ నాగేశ్వర్రెడ్డి తెలిపారు.
ఆ తర్వాత మల్లారెడ్డి కనిపించలేదని.. స్థానికుల సమాచారంతో ఈ ఉదయం పొలాల్లో మృతదేహాన్ని గుర్తించామని చెప్పారు. మల్లారెడ్డి మెడ, భుజాలపై కత్తి గాయాలు ఉన్నాయని చెప్పారు. హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టామని వెల్లడించారు. రాజకీయ కారణాలతో మల్లారెడ్డి హత్యకు గురైనట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి
Accident: శ్రీకాకుళంలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. 30 మందికి గాయాలు