ETV Bharat / state

గింత ఫేమస్‌ అయితననుకోలేదు : గంగవ్వ

author img

By

Published : Oct 15, 2020, 5:18 PM IST

Updated : Oct 15, 2020, 7:53 PM IST

గంగవ్వ.. ఇప్పుడీ పేరు మారుమోగుతోంది. మనింట్లో అవ్వ లెక్కనో.. లేదా బాగా తెలిసిన మనిషిలెక్కనో అందరి మనసుల్ని చూరగొంటోంది. మాటల్లో చెప్పలేని అభిమానాన్ని అందుకుంటోంది. ఆరు పదుల వయసులోనూ తన నటనతో ఆకట్టుకుంటోంది. తెలంగాణలోని మారుమూల పల్లె నుంచి జాతీయస్థాయి వరకు యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు పొందింది. ఇటీవలే బిగ్‌బాస్‌ షో నుంచి బయటకొచ్చిన గంగవ్వ అంతరంగం ఆమె మాటల్లోనే..

telengana you tube star gangavva
గంగవ్వ

మీరంత ఎట్లున్నరు. మీ అందరి అభిమానంతో గిప్పుడైతే చాలా సంతోషంగా ఉన్న. ఎక్కడ ఉండే గంగవ్వను ఎక్కడిదాక పోయిన. తలుసుకుంటె గుండె చెరువైతది. మనుసు బరువైతది. కష్టాలల్లనే పుట్టిన.. కష్టాలల్లనే పెరిగిన. చిన్నప్పుడే పెళ్లైంది మొదలు బతుకు పోరాటంలో పడరాని పాట్లు పడ్డ. కట్టుకున్నోడు దుబాయికి పోయిండు. ఏళ్లతరబడి తిరిగి రాలె. ముగ్గురు పిల్లల ఆకలి తీర్చేందుకు నేనే కూలినాలీ చేసిన. పెంచి పెద్దచేసిన. ఇగ పదేళ్ల తరువాత ఇంటి కొచ్చిన ఆయన ఏ పని చేయకుండా తాగుడు బానిసై చనిపోయిండు. రెక్కలు ముక్కలు చేసుకుని గింతదాక బతుకును తీసుకొచ్చిన. రోజుకు ఎన్నిగంటలు కష్టపడ్డనో నాకు.. ఆ భగవంతునికే తెలుసు.!

పిలగాళ్లే మార్చిన్రు..!

తెలంగాణ యాసలో మాట్లాడటం.. నాలెక్క నేనుండటం.. కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం... నా నైజం. అందుకే నన్ను గమనించిన మా ఊరి పిల్లలు తీసే ‘మై విలేజ్‌ షో’ యూట్యూబ్‌ వీడియోల్లో నాకు అవకాశమిచ్చిండ్రు. మొదట్లో మాటలు లేకుండా కొన్ని పాత్రలిచ్చిండ్రు. మరుగు దొడ్డి మల్లన్న అనే వీడియోలో శ్రీకాంత్‌ అవకాశమిచ్చిండు. తరువాత ఇగ చిన్న చిన్నగా మాటలు మొదలు పెట్టి సినిమాల్లో నటించేదాక వెళ్లిన. 76 వీడియోలతో మైవిలేజ్‌ షో ద్వారా గుర్తింపు పొందిన. ఇస్మార్ట్‌ శంకర్‌, మల్లేశం సినిమాలతోపాటు ఐదు సినిమాలు చేసిన. నాగచైతన్య సినిమాలో నటిస్తున్న. సమంత, విజయదేవరకొండ.. వంటి పెద్ద నటుల ఇంటర్వ్యూలు చేసిన. ఐదు వారాలు బిగ్‌బాస్‌లో ఉన్న. మట్టి వాసన చూస్తూ ఊళ్లల్లో తిరిగిన నాకు గంత పెద్ద ఇంట్లో( బిగ్‌బాస్‌) ఉండటం కష్టమైంది. ఊళ్లో గీ చిన్న ఇంట్లనే ఉంటున్న. ఇల్లు కట్టుకోవాలనే ఆశతో ఉన్న నాకు నాగార్జున సార్‌ ఇల్లు కట్టిస్తనని అన్నడు. సూడాలె. నటిగా ఇది నాకు రెండో జన్మలెక్క. ఏడికి పోయినా గంగవ్వ అనే గుర్తింపు వచ్చింది. ఇదంతా మా ఊరి పిలగాళ్లు శ్రీకాంత్‌, అంజి, చందు, రాజు, అనిల్‌ వల్లనే! పాత గంగవ్వ జీవితాన్ని మార్చి కొత్త జన్మనిచ్చింది వాళ్లే. వాళ్లు లేకుంటే నేనింకా అందరిలాగానే ఉండేదాన్ని.

ఫోన్లల్లో కనిపిస్త అనుకున్న

ఏదో ఊళ్లె పిల్లలు వీడియోలు తీసుకుంటుంటె ఫోన్లల్లో కనిపిస్త అనుకున్న. గింత ఫేమస్‌ అయితననుకోలేదు. ఇగ షూటింగ్‌లలో పెద్దపెద్ద డైలాగ్‌లను బట్టి బట్ట. వాళ్లు చెప్పింది అర్థం చేసుకుని గలగల మాట్లాడుత. ఉత్తప్పుడు నేనెట్ల ఉంటనో గట్లనే షూటింగ్‌లల్ల మెదులుత. అరె మంచిగ చేసినవ్‌ గంగవ్వ అంటే ముచ్చటేసినా.. గది నా తరిఖనే అని నన్ను నేను సముదాయించుకుంట. ఇగ గిట్ల దేశం మొత్తం గుర్తయెటట్టు గింత ఫేమస్‌ అయితననుకోలేదు. మహిళాదినోత్సవాన గవర్నర్‌ తమిళిసై నా నటనకి అవార్డు అందించిండ్రు. లెక్కలేనన్ని ప్రశంసలొచ్చినయి. వస్తున్నయి. ఏది వచ్చినా.. ఎందరు మెచ్చినా.. నేను ఎప్పుడు గంగవ్వ లెక్కనే ఉంట. సినిమాల్లో నానమ్మ, అమ్మమ్మ పాత్రలేవి వచ్చిన చేస్త. షూటింగ్‌ లేని రోజు ఊళ్లె వ్యవసాయం పనులకీ, కూలి కోసం వెళ్త. గదే నాకు ఇష్టం.! నాకు చాతనైనంత సేపు నారెక్కల కష్టంతోనే ముందుకెళ్తా.

జీవితాన్ని చదివేసిన...

లోకాన్ని దగ్గరగా చూసిన దాన్ని ఒక్కసారిగా అందర్నీ ఇడిసి నాలుగు గోడల మధ్య ఉండటం కష్టమనిపించింది. నా మనుషులు... నా ఊరు నా మట్టి వాసన అక్కడ లేవు. ఆడ అందరూ చిన్నపోరలు... అందుకే నా మనుమలు, మనుమరాళ్లతో ఉన్నట్లే నడిచిపోయిందక్కడ. భాష అర్థం కాకున్నా వాళ్ల తీరు జూసి విషయం ఏందో తెలుసుకున్నా. అరవై ఏళ్లు దాటిన ఊరు మనిషిని నేను. భాష... వేషధారణ వేర్వేరుగా ఉన్న... అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా నేను కొన్నిసార్లు మారిన. ఇంకొన్నిసార్లు నా లెక్క నేనున్న. ఆటల పోటీల్లో ఎక్కడా నేను తగ్గలే. వాళ్లకు గట్టి పోటీ ఇచ్చిన. అందరికీ నచ్చిన గంగవ్వ లెక్కనే ఉన్న. ఆట అడాలని ఎంతగా అనుకున్నా... ఉండలేక బయటికి వచ్చిన.

ఇదీ చూడండి.

ఆడ బిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు ఎందుకు..?: పవన్

Last Updated : Oct 15, 2020, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.