ETV Bharat / state

కులూలో తెలుగు యాచకుడి సామాజిక సేవ - telugu begger help news

ఆకలి కేకలు అంటే ఏంటో వారికి తెలుసు! తిండి కోసం.. భిక్షాటన చేస్తూ పొట్ట నింపుకొంటూ ఉంటారు. ఎవరైనా రూపాయి ఇస్తే అదే వారికి మహాభాగ్యం. అలా అలా.. రూపాయి, రుపాయి పోగు చేసిన ఆ యాచకులే.. మానవతను చాటారు. వారు పోగు చేసిన నగదుతో కొంతమందికి సరకులను అందిస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిస్తున్న వేళా.. ఆహారం లేని కుటుంబాలకు ఈ యాచకులే.. బియ్యం, గోధుమలను అందిస్తూ ఉదారత చాటుకుంటున్నారు.

beggar providing food to  needy people in kullu
కులూలో యాచకుల సమాజ సేవ
author img

By

Published : Apr 2, 2020, 2:38 PM IST

Updated : Apr 2, 2020, 6:33 PM IST

కులూలో తెలుగు యాచకుడి సామాజిక సేవ

కరోనా నేపథ్యంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తిండిలేక ఇబ్బంది పడుతున్నవారెందరో ఉన్నారు. హిమాచల్​ప్రదేశ్​ కులూలో ఉంటున్న ఓ ఇద్దరు వ్యక్తులు.. యాచకులుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. రోజూ భిక్షాటన చేస్తూ.. పొట్ట నింపుకొంటారు. ఆకలి బాధ ఎంటో తెలిసిన ఆ యాచకులు అడుక్కుంటూ పోగుచేసిన నగదును సామాజిక సేవకు వినియోగించారు. వారి సమీపంలో ఉండే ప్రాంతాల వారికి ఆహార సరకులు అందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్​కు చెందిన రత్నం (ఫొటోలో గడ్డంతో ఉన్న వ్యక్తి), హిమాచల్​ప్రదేశ్​కి చెందిన బాబా అనే ఇద్దరు వ్యక్తులు.. 20 సంవత్సరాల నుంచి హిమాచల్​ప్రదేశ్​ కులూలో భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. కులూలో ఏ పేదలూ ఆకలితో ఉండకూడదని జిల్లాలో ఉన్న అన్నపూర్ణ అనే సంస్థకు మద్దతుగా వారిద్దరూ 50 కిలోల పిండి, 50 కిలోల బియ్యం, 10 కిలోల పప్పులు.. ఇతర సామగ్రిని అందజేశారు. వారికే తినడానికి లేకపోయినా.. సామాజిక సేవ చేస్తూ అందరిలో స్పూర్తిని పంచుతున్నారు.

ఇదీ చూడండి:

కరోనా జాగ్రత్తల్లో ఆదివాసీ పల్లెలు.. స్వచ్ఛందంగా జాగ్రత్తలు

Last Updated : Apr 2, 2020, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.