కృష్ణాజిల్లా, మోపిదేవి మండలంలో వ్యవసాయానికి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ కోతలు విధించారు. మూడు గంటలు ఎమర్జన్సీ లోడ్ రిలీఫ్ వలన విధ్యుత్ నిలిపివేసిన కారణంగా.. అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా 9 గంటలు సమయం వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
ఈ కారణంగా.. కొందరు రైతులు కంద మొక్కలకు నీరు పెట్టడానికి కులీలను పెట్టుకోగా మరికొందరు రైతులు ఇతర పంటలకు ఎరువులు వేసుకున్నారు. ఎంతసేపు చూసనా కరెంటు రాక పని లేక కూలీలు వెళ్ళిపోయారు. మోపిదేవి మండలంలో వేల సంఖ్యలో వ్యవసాయ పంపుసెట్ల కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్ నిలుపుదల చేసే సమయంలో ముందుగా తెలియజేయాలని.. కనీసం పోన్లకు మెస్సేజ్ ద్వారా అయినా తెలియజేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: