ETV Bharat / state

బంగారం చోరీ చేశారని వివస్త్రను చేశారు.. తర్వాత దొరికిందని సారీ చెప్పారు! - నందిగామ లేటెస్ట్​ అప్​డేట్​

Protest: మహిళా దినోత్సవం రోజున బంగారం గొలుసు దొంగతనం చేశారనే నెపంతో ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి హింసించిన ఘటనపై మహిళలు నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నందిగామ డీఎస్పీ కార్యాలయం వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్పందించిన డీఎస్పీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే...

BC unions Protest at Nandigama DSP office
బీసీ సంఘాల ఆందోళన
author img

By

Published : Mar 9, 2022, 4:14 PM IST

బంగారపు గొలుసు చోరీ చేశారనే అనుమానంతో.. ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి హింసించారని, ఈ ఘటనకు కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. నందిగామ డీఎస్పీ కార్యాలయం వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్పందించిన డీఎస్పీ.. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అసలేం జరిగిందంటే..?
నందిగామకు చెందిన ఇద్దరు మహిళలు రోల్డ్ గోల్డ్ వస్తువులు విక్రయించేందుకు చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి వెళ్లారు. గ్రామంలోని ఓ ఇంట్లోని వాళ్లకు రోల్డ్ గోల్డ్ వస్తువులు చూపించి కొనుగోలు చేయాలని కోరారు. ఆ తర్వాత సదరు మహిళలు తమ దారిన తాము వెళ్లిపోయారు. అయితే.. ఆ ఇంట్లో ఉన్న బంగారం గొలుసు ఒకటి కనిపించట్లేదని, రోల్డ్ ​గోల్డ్ వస్తువులు అమ్ముకోవటానికి వచ్చిన వారే తీసి ఉంటారని ఆ ఇంటి కుటుంబసభ్యులు అనుమానించారు.

వెంటనే ఆ ఇద్దరిని పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. నలుగురు మహిళలు, మరో వ్యక్తి కలిసి.. ఆ ఇద్దరు మహిళలను దారుణంగా కొట్టి హింసించారు. అంతటితో ఆగకుండా మహిళను వివస్త్రను చేసి గొలుసును వెతికారు. అయితే.. కొద్దిసేపటి తర్వాత ఆ ఇంట్లోనే ఆ బంగారపు గొలుసు దొరకడంతో.. దాడిచేసిన వారు తాము తప్పు చేశామని, బాధిత మహిళలను ఆటో ఎక్కించి నందిగామ పంపించారు.

బాధిత మహిళలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నందిగామ డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. డీఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన డీఎస్పీ నాగేశ్వర్​రెడ్డి బాధిత మహిళలకు న్యాయం చేస్తామని, ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: Suicide: యువకుడి ఆత్మహత్య.. సీఐ కొట్టడం వల్లేనంటూ బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.