బీసీ కులాలన్నీ ఒకే తాటిపైకి రావడం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు అన్నారు. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో బీసీ మేదోమథన సదస్సు నిర్వహించారు. సమావేశంలో 13 జిల్లాలకు చెందిన బీసీ సంఘాల నేతలు, కుల సంఘాల నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిందని... బీసీలంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని నాయకులు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బీసీలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని సినీ రచయిత, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. మేదోమథన సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై త్వరలోనే విజయవాడ డిక్లరేషన్ పేరుతో రాజకీయ పార్టీలకు నివేదిక ఇస్తామని నేతలు తెలిపారు. దీనిని ఆమోదించిన పార్టీకే మద్దతిస్తామని లేకుంటే సొంతంగా పార్టీ పెట్టి రాజ్యాధికారం కోసం పోరాడతామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: