కృష్ణా జిల్లా పెడన మున్సిపల్ ఛైర్పర్సన్గా బల్ల జ్యోత్స్నా రాణి బాధ్యతలు స్వీకరించారు. ఎండీ ఖాజాను వైస్ ఛైర్మన్గా సభ్యులు ఎన్నుకున్నారు. ఛైర్పర్సన్ , వైస్ ఛైర్మన్, వార్డు సభ్యులతో కౌన్సిల్ హాల్లో ఆర్డీఓ ఖాజావలి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్ హాజరయ్యారు. మొత్తం 23 స్థానాల్లో 21 వార్డులను వైకాపా కైవసం చేసుకోగా.. తెదేపా, జనసేనలు చెరొకటి సాధించాయి. ఫలితంగా ఛైర్పర్సన్ ఎన్నిక లాంఛనమైంది. ఈ సందర్భంగా వైకాపా నేతలు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి: