రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నా హోం మంత్రి మౌనవ్రతం చేయడం బాధాకరమని తెదేపా నేత బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. తనకేమీ సంబంధం లేదన్నట్లుగా హోం మంత్రి సుచరిత ప్రవర్తన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సామాజికవర్గ మెప్పు కోసం దళిత జాతికి అన్యాయం చేయొద్దని హితువు పలికారు. దళితులపై ఇన్ని దాడులు జరుగుతున్నా హోంమంత్రి స్పందన లేకపోవడంతో.. ఇదేనా నేను రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసే విధానం అని అంబేడ్కర్ సైతం మనస్థాపానికి గురయ్యేలా పరిస్థితి ఉందన్నారు.
ఇదీ చదవండి: హైకోర్టు చివాట్లు పెడుతున్నా..ప్రభుత్వంలో మార్పురావట్లేదు:గోరంట్ల