కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో చేపట్టిన అయోధ్య రామమందిర నిర్మాణ నిధి సేకరణ శోభాయాత్ర విజయవంతంగా సాగింది. రెండు కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. అన్ని వర్గాలువారి నుంచి విశేష స్పందన లభించింది.
పలు కూడళ్లలో ప్రసంగాలు, భజనలు చేశారు. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు లలితా పీఠాధిపతి ఆదిత్యానంద భారతి స్వామి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: