వృద్ధులకు ఆసరాగా ఉండే పెన్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ఇండియన్ బ్యాంకు ఉద్యోగి రామ్మోహన్ రావు తెలిపారు. అటల్ పెన్షన్ యోజన పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంపై విజయవాడ అంబేడ్కర్ భవన్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాలోని వివిధ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొని పెన్షన్ పథకంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేశారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు అటల్ పెన్షన్ యోజన పథకంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగానే నేడు విజయవాడలో కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
ఇదీచదవండి