ETV Bharat / state

అవనిగడ్డ: అనుమానస్పద స్థితిలో వైద్యుడు మృతి - అవనిగడ్డ వైద్యుడు కోట శ్రీహరిరావు మృతి

వైద్యుడు కోట శ్రీహరిరావు.. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని తన నివాసంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. సీసీటీవీ కెమేరాలు పైకి తిప్పి ఉన్న కారణంగా.. పోలీసులు ఈ ఘటనను హత్యగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రవీంద్రబాబు.. డాగ్ స్క్వాడ్​ని రంగంలోకి దించారు.

doctor dead
మృతి చెందిన వైద్యుడు శ్రీహరి రావు
author img

By

Published : Nov 28, 2020, 4:55 PM IST

Updated : Nov 28, 2020, 10:44 PM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డలో.. వైద్యుడు కోట శ్రీహరిరావు.. స్థానిక సబ్ ‌డివిజన్‌ పోలీసు కార్యాలయం వెనుకనున్న తన నివాసంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లగా.. ఆయన ఒక్కరే ఇంట్లో ఉన్నారు. సీసీటీవీ కెమెరాలు పైకి తిప్పేసి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు.. హత్యకేసుగా భావించి దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్పీ రవీంద్రబాబు.. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. త్వరలోనే నిందితులను గుర్తించి వాస్తవాలు నిగ్గు తేలుస్తామని చెప్పారు.

ఉదయం చికిత్స కోసం వచ్చిన రోగులు.. శ్రీహరిరావుకు ఎంత సేపు ఫోన్ చేసినా తీయలేదు. పైకి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. జాగిలాలతో ఆధారాల కోసం వెతికారు. రోజులో ఎక్కువ భాగం వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమై ఉంటారని.. 25 ఏళ్లు ఆయన వద్ద పనిచేసిన కాంపౌండర్​ తెలిపాడు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నివాసానికి 400 మీటర్లు, డివిజన్ పోలీసు కార్యాలయానికి 300 మీటర్ల దూరంలోనే.. ఈ హత్య జరగడం గమనార్హం.

మృతి చెందిన వైద్యుడు శ్రీహరి రావు

ఇదీ చదవండి:

గన్నవరం ఘనవరం అయ్యేదెప్పుడు..?

Last Updated : Nov 28, 2020, 10:44 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.