ETV Bharat / state

'ఆ జీవోను ఉపసంహరించుకోకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం' - ఆటో సమాచారం విజయవాడ

జీవో నెంబర్​ 21 రవాణా కార్మికులకు గుదిబండలా మారిందని ఆటో వర్కర్ల జేఏసీ సంఘం నాయకులు అన్నారు. జీవోను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

meeting
'ఆ జీవోను ఉపసంహరించుకోకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం'
author img

By

Published : Dec 27, 2020, 3:28 PM IST

రవాణా రంగ కార్మికులపై జరిమానా రూపంలో పెను భారాలు మోపే జీవో నెంబర్ 21 ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో వర్కర్ల జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో సమావేశం నిర్వహించారు. రవాణా రంగం ద్వారా జీవనోపాధి పొందుతున్న లక్షలాది కార్మికులపై జీవో నెంబర్ 21 ఉరితాడులా మారిందని ప్రగతిశీల ఆటో కార్మికుల సంఘం నగర కార్యదర్శి శ్రీనివాస్ రావు ఆరోపించారు.

అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా అర్హులైన వారికి ఇప్పటిదాకా లైసెన్స్​లు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. గతంలో 100 రూపాయలు ఉండే జరిమానా 1000 రూపాయలయ్యిందని.. ఇది రవాణా రంగ కార్మికులకు పెనుభారమన్నారు. జీవో నెంబర్ 21 ఉపసంహరించుకునే దాకా ఆటో కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: విజయవాడకు రెండు అత్యాధునిక సరకు రవాణా నడవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.