కృష్ణా జిల్లా గంపలగూడెం వద్ద జరిగిన ప్రమాదంలో తేజస్విని(3) అనే చిన్నారి మృతి చెందగా... మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపైకి అకస్మాత్తుగా వచ్చిన గేదెను తప్పించబోయి సైకిల్‌ను ఆటో ఢీకొట్టింది. సైకిల్‌పై ఉన్న అంజయ్య గాయాలతో బయటపడ్డాడు. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో... తేజస్విని (3) మృతి చెందగా... ఐదు నెలల పాప జ్యోతి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం పాపను విజయవాడ తరలించారు. క్షతగాత్రులు తిరువూరు పట్టణ శివారు సుందరయ్య కాలనీకి చెందిన తాళ్లూరి కృష్ణ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :