కృష్ణా జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా కొవిడ్ బాధితులకు వైద్య చికిత్సలు అందిస్తున్న లిబర్టీ, ఆంధ్రా, నిమ్రా ఆస్పత్రులను డీఎంహెచ్ఓ, వైద్యాధికారులతో కలసి జేసీ శివశంకర్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మల్లికార్జున ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆరోగ్యశ్రీ కింద 50 శాతం పడకలు కేటాయించని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు.
ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య చికిత్సలు పొందుతున్న వారి నుంచి అధిక సొమ్మును వసూలు చేస్తున్న నిమ్రా ఆసుపత్రిపై అధికారులు కేసు నమోదు చేశారు. రూ.20 లక్షలు జరిమానా విధించినట్లు జేసీ శివశంకర్ తెలిపారు. కరోనా బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాలో 77 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఇదీ చదవండి